16-08-2024 01:33:04 AM
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కరీంనగర్, ఆగస్టు 15 (విజయక్రాంతి): తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉం డేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం కరీంనగర్ పరేడ్ మైదానంలో జెండా ఆవిష్కరిం చారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ౪౮ గంటల నుంచే హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించిందన్నారు.