01-10-2025 01:53:25 AM
తుర్కయంజాల్, సెప్టెంబర్ 30: రైతులను అభివద్ధి చేయడంలో తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం ముందుందని టీజీ కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. మన్నెగూడలోని జేఎంఆర్ గార్డెన్స్‌లో సత్తయ్య అధ్యక్షతన తుర్కయంజాల్ ఎఫ్ ఎస్ సీ ఎస్ 53వ సర్వసభ్య సమావేశం జరిగింది.
తుర్కయంజాల్ ఎఫ్ ఎస్ సీ ఎస్ ఏర్పడి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంకు అభివద్ధికి ఎంతగానో తోడ్పిన సంఘం మాజీ అధ్యక్షులను సన్మానించారు. అనంతరం సత్తయ్య మాట్లాడుతూ 2024- 25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.5.04కోట్ల నికర లాభం ఆర్జించినట్లు వెల్లడించారు. ఖాతాదారులు సకాలంలో బకాయిలు చెల్లించడం వల్లే ఇది సాధ్యమైందని, ఇందుకోసం కష్టపడిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
రైతుల సంక్షేమం, అభివద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో కోహెడలో ఐదు ఎకరాల భూమిని రైతుల కోసం సాధించామన్నారు. ఇక్కడ రైతుల సౌకర్యార్థం కోహెడలో గోడౌన్స్ నిర్మించామన్నారు. త్వరలోనే ధాన్యం ఆరబోసుకునేందుకు కల్లాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షులు సంరెడ్డి బాల్ రెడ్డి, కొంతం మల్లారెడ్డి, సీనియర్ నాయకులు కందాడ లక్ష్మారెడ్డి, పర్సన్ ఇన్ చార్జ్ కమిటీ సభ్యులు కొత్త రాంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, సామ సంజీవరెడ్డి, కొండ్రు స్వప్న శ్రీనివాస్, చాపల యాదగిరి, చెక్క లక్ష్మమ్మ, శీలం లక్ష్మమ్మ, జక్క కష్ణారెడ్డి, సామ సత్యనారాయణరెడ్డి, బీజేపీ నాయకులు కందాల బలదేవరెడ్డి, బచ్చిగళ్ల రమేష్, ఎలిమినేటి నర్సింహారెడ్డి, సంఘ సెక్రటరీ వై.రాందాస్ తదితరులు పాల్గొన్నారు.