01-10-2025 01:52:05 AM
ఘట్ కేసర్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్ అవుషాపూర్ లో దుర్గాదేవి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద మంగళవారం హోమం పూజాకార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
హోమం కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి తన కుటుంబ సమేతంగా, అమ్మవారి మాలదారులతో కలిసి పాల్గొని అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనడంతో అమ్మవారి మండప ప్రాంతం భక్తజనులతో కిటకిటలాడింది. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.