02-12-2025 12:52:56 AM
ఆలేరు, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఆలేరు మున్సిపాలిటీ 6వ వార్డ్ బహదూర్ పేటకి చెందిన చెరువు సుందరి కరణ కొరకు ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య సహకారం తో 3కోట్ల పద్నాలుగు లక్షల అరవై వేలు రూపాయలతో అభివృద్ధి కి ఈరోజు బీర్ల ఐలయ్య శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఎ ఏజాస్ ఆలేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ బర్ల శ్రీనివాస్, బహదూర్ పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వట్టిపల్లి శ్రీనివాస్, 6వ వార్డ్ కంటెస్టెడ్ కౌన్సిలర్ అంగిడి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ కూళ్ల నర్సింహులు, వట్టిపల్లి సిద్దిమల్లయ్య, కూళ్ల బిక్షపతి, కూళ్ల సత్తయ్య కూళ్ల సిద్దులు వట్టిపల్లి సిద్దిరాజు వట్టిపల్లి లక్ష్మణ్, వట్టిపల్లి రాములు, పర్శ నరేష్, వట్టిపల్లి వినయ్, పుప్పాల రాజేష్, నీలం కార్తీక్, ఊత పవన్, బహదూర్ పేట ముదిరాజ్ సంఘం సభ్యులు ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.