24-09-2025 12:03:27 AM
మద్నూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సోనాల గ్రామం నుండి గోజేగావ్ రోడ్డు 2.30 కిలోమీటర్ల మేర భాగా దెబ్బతింది. దాని మరమ్మతుల కోసం 1.38 లక్షల నిధులు మంజూరు అయ్యాయి.ఇక ఎస్ ఎన్ ఎ జాతీయ రహదారి నుండి పెద్ద ఎక్లారా, దన్నూర్, సోమూరు ఎక్స్ రోడ్డు వరకు ఎనిమిది కిలోమీటర్ల చెడిపోయిన రోడ్డు నిర్మాణానికి నాలుగు లక్షల 80 వేల రూపాయలు మంజూరు అయ్యాయి.
అదేవిధంగా ఎస్ ఎన్ ఏ జాతీయ రహదారి నుండి చిన్న ఎక్లారా, కొడిచరా గ్రామం వరకు 5.40 కిలోమీటర్ల రోడ్డు మరమ్మత్తుల కోసం మూడు లక్షల 24 వేల రూపాయలు మంజూరు అయ్యాయి. ఇక డోంగ్లి మండలంలోని లింబూర్ వాడి గ్రామానికి చెడిపోయిన రోడ్డు మరమ్మత్తుల కోసం రూ. 1,32,000 మంజూరైనట్లు పంచాయతీరాజ్ డిప్యూటీ ఈ ఈ మధు బాబు, ఏ ఈ అరుణ్, మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ పనుల నిర్మాణాల కోసం త్వరలోనే కాంట్రాక్టర్లకు నియమించి చెడిపోయిన రోడ్ల మరమ్మత్తుల పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.