calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు

25-09-2025 12:00:00 AM

 పాల్గొన్న అదనపు కలెక్టర్ మరియు శిక్షణ కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 23, (విజయక్రాంతి):దసరా సంబరాల్లో భాగంగా మూడవ రోజు జరుపుకునే ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్  డి. వేణుగోపాల్ , శిక్షణ కలెక్టర్  సౌరభ్ శర్మ  హాజరై, మహిళా ఉద్యోగులతో కలిసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పూజలో పాల్గొని ఆడి, పాడారు.

సంప్రదాయం ప్రకారం చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం వంటి పూలతో మూడంతరాలలో బతుకమ్మను నిర్మించి, తామర పాత్రల్లో కళాత్మకంగా అలంకరించడం జరిగింది.మహిళా ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పూలతో బతుకమ్మను అందంగా అలంకరించడమే కాకుండా భక్తి భా వంతో నృత్యాలు, ఆడిపాడుతూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా జానపద గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యక్రమం మరింత రసవత్తరంగా సాగింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  డి. వేణుగోపాల్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల సాంఘిక ఐక్యత బలపడుతుందని పేర్కొన్నారు. అలాగే ముద్దపప్పు బతుకమ్మ సమర్పణ ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శ్రే యస్సుకు దోహదం చేస్తుందనే విశ్వాసాన్ని అన్నారు.శిక్షణ కలెక్టర్  సౌరభ్ శర్మ మాట్లాడుతూ ఇటువంటి పండుగలు ఉద్యోగుల మధ్య సఖ్యత, సామరస్య వాతావరణాన్ని పెంచుతాయని, కా ర్యాలయ వాతావరణంలో ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. ఈ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనీనా, వైద్య శాఖ సిబ్బంది, మహిళా ఉద్యోగులు తదితరులుపాల్గొన్నారు.