calender_icon.png 8 November, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలి

08-11-2025 12:03:35 AM

మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి డిమాండ్

ఆళ్ళపల్లి, నవంబర్ 7, ( విజయక్రాంతి): జిల్లాలో అన్ని మండలాల్లో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి డిమాండ్ చే శారు. శుక్రవారం బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల కేంద్రం నుండి కాచనపల్లి వెళ్లే మార్గమధ్యంలో ప్రమాదకరంగా ఉన్న గుంతలను మట్టితో పూడ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

గుంతల మయంగా ఉన్న రో డ్ల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రమాదకరంగా ఉన్న రహదా రుల పై డిజిటల్ క్యాంపెయిన్ కు పిలుపు నిచ్చారు. మణుగూరు బి ఆర్ ఎస్ భవన్ పై జరిగిన దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూసం. నాగేష్, రఘుపతి ,మొక్కటి రామ్ చరణ్ , కుంజ రవితేజ , గొగ్గేల సాత్వి క్ , కోరం.రంజిత్. తదితరులు పాల్గొన్నారు.