02-10-2025 12:00:00 AM
ఎక్కువ ధరకు మద్యం.. మాంసం అమ్మకాలు
కరీంనగర్, అక్టోబరు 1 (విజయ క్రాంతి): ఈ సారి దసరా గాంధీ జయంతి రోజు వ చ్చింది. గురువారం మద్యం, మాంసం దుకాణాలు బంద్ కావడంతో ఒక రోజు ముందే కావలసినవి కొనేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 290 మద్యం దుకాణాల్లో ఒక్కరోజే 30 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. ఆబ్కారీ అధికారుల అండతో గురువారం అమ్మకాల కోసం బెల్ట్ షాప్ కు స్టాక్ ను లిఫ్ట్ చేశారు.
బెల్ట్ షాప్ ల ద్వారా 10 కోట్ల రూపాయల మేర ఒక్క రోజే వ్యాపారం జరిగే అవకాశం ఉంది. అధికారులు దసరా రోజు మద్యం అమ్మే బె ల్ట్ షాప్ ల బెల్ట్ తీస్తారా లేక చూసి చూడన ట్లు ఉంటారా చూడాలి. బెల్ట్ షాప్ ల ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు దసరా రోజు పెరుగనున్నది. ప్ర తీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
ఎప్పుడో ఎలక్షన్లప్పుడో, కొన్ని సందర్భాల్లో నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీస్, ఎక్సైజ్ శాఖలు తర్వాత వారికి సహకరించినంత పని చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎనిమిది కి తగ్గకుండా బెల్టు దుకాణాలు పని చేస్తున్నాయి. లైసెన్స్ పొందిన దుకాణాల సంఖ్య కంటే దాదాపు 13 రె ట్లు ఎక్కువ. దసరా రోజు మరింత ఎక్కువ ధరకు అమ్మడానికి సిద్ధం అయినారు.
నవంబర్ 30 తో ప్రస్తుత మద్యం దుకాణాల లైసె న్సు గడువు ముగిస్తుండటంతో ఎస్త్స్రజ్ అధికారులు విధించిన దసరా అమ్మకాల టార్గెట్ ని రీచ్ కావడానికి తమవద్ద పని చేసే వారి తో దొడ్డిదారిన బుధవారం రాత్రి నుండి మ ద్యం అమ్మకాలు సాగించారు. ఇదే అదనుగా బాటిల్ కి 200 రూపాయలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
- మటన్ కిలో వెయ్యి
దసరా గాంధీ జయంతి రోజు రావడం తో మాంసం వ్యాపారులు పండుగ రోజున విక్రయాలకు అనుమతి ఇవ్వాలని అధికారులని కోరారు. వారు నో అనడంతో బుధవా రం రాత్రి 12 గంటలవరకు రేటును పెంచి వెయ్యి రూపాయలకు కిలో చొప్పున మటన్, 300 రూపాయలకు చికెన్ అమ్మకాలు జరిపారు. గురువారం షాపులు తీయకుండా త మ ఇండ్ల వద్ద లేదా మాంసం ప్రియుల ఇం డ్ల వద్ద కోసేందుకు మాంసం వ్యాపారులుసిద్ధమయ్యారు.