calender_icon.png 9 August, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

09-08-2025 03:08:18 AM

- హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ..

- సెప్టెంబర్ 6న జరిగే గణేష్ నిమజ్జనంలో పాల్గొనాలని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ..

ముషీరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలను భక్తులు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని హిమాచల్ ప్రదేశ్,  హర్యానా రాష్ట్రాల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను బండారు దత్తాత్రయ రామ్ నగర్ లోని ఆయన నివాసంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నూతన సభ్యులు సెప్టెంబర్ 6 న భాగ్యనగర్‌లో జరిగే సామూహిక గణేష్ నిమజ్జనంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. దత్తాత్రేయను కలిసిన వారిలో ఉత్సవ కమిటీ నూతన ఉపాధ్యక్షుడు  కరోడిమల్ అగర్వాల్,  కార్యదర్శి ఆలె భాస్కర్, సభ్యులు  బద్దం మహిపాల్ రెడ్డి, నాయిని బుచ్చి రెడ్డి,  జి. ఆనంద్ గౌడ్,  వైకుంటం, మాజీ కార్పొరేటర్ శ్రీరామ్ వ్యాస్ ఇతర భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హాజరయ్యారు.