22-08-2025 12:00:00 AM
నిర్మల్, ఆగస్టు ౨౧ (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ రాకేష్ మీనా అన్నారు. గురువారం నిర్మల్ గణేష్ మండపాల నిర్వహణతో సమావేశం నిర్వహించారు. 11 రోజులపాటు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయ పద్ధతిలో భక్తి వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. మండపాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని శోభయాత్ర నిర్మించే రోజు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. ఈ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.