01-09-2025 01:15:14 AM
ఎల్బీనగర్, ఆగస్టు 31 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతీమణి కమలారెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో పర్యటించి, గణనాథులకు పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
ఎల్బీనగర్లోని సిరినగర్ కాలనీలో ఆజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో నవరాత్రులు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఆదివారం అన్నదానం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, ఎల్బీ నగర్ సీఐ వినోద్, డీఐ నాగార్జున రెడ్డి, ఎస్త్స్రలు మల్లయ్య, ప్రసాద్, బీజేపీ నాయకులు చిన్నం నరేశ్, ఆజాద్ యూత్ సభ్యులు శ్రీకాంత్, మల్లికార్జున్, ప్రవీణ్, వినోద్, ప్రశాంత్, తీగల సురేష్, రిషి, రాఘవేంద్ర, కిరణ్, సాయి, సాయి భగవాన్, బిట్టు, ఈశ్వర్ పాల్గొన్నారు.