calender_icon.png 10 September, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్లివిరిసిన మతసామరస్యం

01-09-2025 01:14:11 AM

చేవెళ్ల, ఆగస్టు 31: చేవెళ్ల కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద మత సామరస్యం వెల్లివిరిసింది. ఆదివారం శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్ గ్రామానికి చెందిన సీనియర్ అడ్వకేట్ మహమ్మద్ తాజుద్దీన్ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతేకాదు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా తోటి అడ్వకేట్లు మహమ్మద్ తాజుద్దీన్ ను అభినందించారు. అనంతరం లడ్డూ వేలం పాట నిర్వహించగా టీం మిత్ర’ సభ్యులు రూ. 1.26 లక్షలకు దక్కించుకున్నారు.

అనంతరం వినాయకుడిని శోభాయాత్ర గా తీసుకెళ్లి చేవెళ్ల వేంకటేశ్వర స్వామివారి గుండంలో నిమజ్జనం చేశారు. అలాగే చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని సిపిఐ కాలనీలో మైనార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ (లియాకత్) అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటారు.