01-09-2025 01:16:55 AM
మేడ్చల్, ఆగస్టు 31(విజయ క్రాంతి): మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో గణనాథులను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కూకట్పల్లిలోని అపర్ణ కాలనీ, మారి గోల్ అపార్ట్మెంట్, తులిప్ గ్రేటర్ కమ్యూనిటీలో, ఎల్లో బెల్స్ అపార్ట్మెంట్లో అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున గణనాథులను ప్రతిష్టించి పూజలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, గొల్ల పోచంపల్లి మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్, అమరం మోహన్ రెడ్డి, శ్రీనివాస్, విజిత్, శ్రీధర్, శివాజీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.