10-02-2025 01:19:06 AM
5 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం
జగిత్యాల, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనాల దొంగతనం చేస్తున్న దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు పట్టుకుని నిందితుల నుంచి 5 ద్విచక్ర వాహనాలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపతి కుమారస్వామి, బుర్ర రాజేందర్లు ఒక ముఠాగా ఏర్పి రాత్రి వేళల్లో కలమడుగు నుంచి కారులో బయల్దేరి వివిధ గ్రామాల్లో ఇంటి ముదు పార్కు చేసిన బైకులను దొంగిలిస్తుండేవారు.
జగిత్యాల జిల్లాలో ఇలాంటి దొంగతనాలు చేయగా, ఇట్టి నిందికులను చాకచక్యంగా పట్టుకొని టు వీలర్ బైక్లను రికవరి చేసిన జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్‌ఐ సుధాకర్, పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాస్, గంగాధర్, రాహుల్, ఉమర్, మోహన్లను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.