calender_icon.png 2 January, 2026 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామ్మో వాయ్యో వల్లెంకలో..

01-01-2026 12:00:00 AM

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న తాజాచిత్రం ‘భర్త మ హాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సం క్రాంతికి వినోదాన్ని అందించడానికి జనవరి 13న థియేటర్లలో అడుగుపెట్టనుందీ సినిమా. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోంది. ఇందులోభాగంగా జనవరి 2న వరంగల్‌లో ఓ ఈవెంట్‌ను నిర్వహించ నున్నారు.

ఈ వేదికపై ఈ సినిమాలోని ‘వామ్మో వాయ్యో’ సాంగ్‌ను ఆవిష్కరించ నున్నారు. ఈ మేరకు విడుదల చేసిన సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోం ది. ‘వామ్మో వాయ్యో వల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..’ అంటూ సాగుతున్న ఈ పాట సంగీత ప్రియుల హృదయాలను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా జానపదా ల్లో ప్రాస, లయ కోసం వినియోగించే అనుకరణ పదాలైన ‘వ ల్లెంకలో..’ ‘సల్లెంకలో..’ ఈ పాటకు సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి.

ఈ గీతానికి దేవ్ పవార్ సాహిత్యం అం దించగా, స్వాతిరెడ్డి ఆలపించారు. ఇక పాటలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కలర్‌ఫుల్ అవుట్ ఫిట్స్‌లో మాస్ అండ్ స్టైలిష్‌గా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చుతుండగా, ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.