calender_icon.png 4 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోనాలిసా లైఫ్ తొలి షెడ్యూల్ పూర్తి

04-12-2025 01:58:12 AM

కుంభమేళా ఫేమ్ మోనాలిసా భోంస్లే కథానాయికగా, సాయిచరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లైఫ్’. ఈ సినిమాకు శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వెంగమాంబ క్రియేషనర్స్ బ్యానర్‌పై అంజన్న నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో షాయాజీ షిండే, సీనియర్ నటుడు సురేశ్, ఆమని, తులసి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్; సాహిత్యం: కాసర్ల శ్యామ్, జేపీ; డైలాగ్స్: శ్రీరామ్ ఏదోటి, గుత్తి మల్లికార్జున్, భాస్కర్; ఆర్ట్: బేబీ సురేశ్.