calender_icon.png 22 August, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్జాగా కబ్జా.. పట్టించుకునేవారేరీ?

22-08-2025 01:07:24 AM

  1. ఆదిభట్ల మున్సిపాలిటీలో యథేచ్ఛగా ప్రభుత్వస్థలాల ఆక్రమణలు

కన్వెన్షన్లు నిర్మించి దర్జాగా కోట్ల రూపాయలు జేబులోకి

కళ్లముందే కబ్జాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

అధికారుల పనితీరుకు అద్దం పడుతున్న ఓ అక్రమ నిర్మాణం

మున్సిపల్ స్థలం కాపాడలేని కమిషనర్ ఎందుకంటున్న జనం

ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝళిపించి ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటుండగా, మరోవై పు మున్సిపల్ అధికారులు మాత్రం... తమ కళ్లముందే ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నా చూస్తుండిపోతున్నారు.

ప్రభుత్వ అధికారు లు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి... కానీ రంగారెడ్డి జి ల్లాలో అధికారులు మాత్రం అధికారం, పలుకుబడి ఉన్న నేతలకు సలాం అంటూ గులా మ్ గిరీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

ఇబ్రహీంపట్నం,ఆగస్టు 21:అన్యాక్రాంతమైన మున్సిపల్ స్థలం కాపాడటంలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారని తేటతెల్లమవుతున్నది. రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల మున్సిపల్ పరిధి, కొం గరకలాన్ సమీపంలో ఉన్న శ్లోకా కన్వెన్షన్ హాల్ స్థానిక మున్సిపాలిటీకి ఏడాదికి రూ.2,48,044 టాక్స్ రూపంలో చెల్లిస్తుంది, ఈ కన్వెన్షన్ హాల్ సుమారు 3 సంవత్సరాల క్రితం ప్రారంభించారు.

ఇందు లో ఒక ఫంక్షన్ చేయాలంటే రూ.7 లక్షల నుంచి రూ. 8.లక్షల వరకు వినియోగదారు లనుంచి తీసుకుంటారు. సీజన్, అను సీజన్ కలుపుకొని ఏడాదికి సరాసరి 100 కు పైగా శుభాకార్యా లు అవుతాయి. ఈ లెక్కన ఏడాదికి సుమారుగా రూ.8 కోట్ల వరకు ఆదా యం వస్తుంది. ఇదంతా అక్రమంగా మున్సిపాలిటీ కి కేటాయించిన స్థలం లో దర్జాగా అక్రమార్కులు తమ జేబులో వేసుకుంటున్నారు.

అయితే గతంలో ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించే క్ర మంలో హెచ్‌ఎండీఏ ప్లాన్ లో భాగంగా మున్సిపాలిటీ స్థలాన్ని కూడా వదలకుండా ఆక్రమించి సీసీరోడ్డు, ప్రహరీ గోడను నిర్మించారు. దీనిపై స్థానికు ల ఫిర్యాదులు, చర్యలు తీసుకోవాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా, స్పందించకపోవడం అనేది ఆదిభట్ల మున్సిపల్ అధికారుల పనితీరుకు అద్దం పడు తోంది. అయి తే దీనివెనుక ఓ రా జకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు సమాచారం.

అక్రమం వెనక ఎవరు?

కోట్లు విలువ చేసే.. మున్సిపల్ గిఫ్ట్ డీడ్ స్థలం అన్యాక్రాంతం అవుతుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు. చర్యలు తీసుకోవడంలో అధికారులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? లేకా, పెద్ద మొత్తంలో ముడుపులు అందడంతో చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారా..?

అని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు దీనివెనుక ఉన్న సూత్రధారులెవరు. అసలు మున్సిపాలిటీలో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉ న్నాయనే ప్రశ్నలు స్థానికంగా ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పంది స్తే అసలు కథ వెలుగులోకి వస్తుందని స్థాని క ప్రజలు చర్చించుకుంటున్నారు.

నిబంధనల భారం.. పేదోడికేనా ?

మున్సిపల్ నిబంధనలు బలిసినోడికన్నా, పేదవాడిపైనే ఎక్కువ ప్రభావం చూపుతోం ది. అనుమతులు లేకుండా పేదవాడు చిన్నగూడు కట్టుకుంటే వదలని అధికారులు, వా రి గూడులను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టేందు కు ఆగమేఘాల మీద అక్కడికి వాలిపోతా రు.

కానీ నిబంధనలకు విరుద్ధంగా రూ.కోట్ల విలువ చేసే మున్సిపాలిటీ స్థలం అన్యాక్రాంతమైన, అటువైపు అధికారులు కన్నెత్తి చూడ టం లేదంటే విషయం ఇట్టే అర్ధం అవుతోం ది. అడిగినంత ఇస్తే అక్రమం.. సక్రమం చే స్తారు, లేదంటే అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయని చెప్పకనే చెబుతున్నారు.

పరోక్షంగా సహకారమేనా!

అక్రమాలపై చర్యల విషయమై వివరణ కోసం ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫోన్ లో సంప్రదించినా అందుబాటులోకి రాలేదు. అధికారు లు మున్సిపాలిటీలోనీ అక్రమాలపై వివరణ ఇవ్వడానికి నిరాకరిస్తుండడం పట్ల అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోప ణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు జవాబు దారితనం గా ఉండాలి కానీ...

మున్సిపల్ లో అధికారులు మాత్రం అందుకు వీరుద్దంగా వ్యహరిస్తున్నారానే ఆరోపణలు మాత్రం సర్వత్రా విమర్శలు ఉ న్నాయి. జిల్లా కలెక్టరెట్ కు కూత వేటు దూ రం లో ఉన్న మున్సిపల్ లో అక్రమనిర్మాణాల పై కలెక్టర్ దృష్టి సారించి అక్రమ మా ర్కు లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డి మాండ్ చేస్తున్నారు.