calender_icon.png 27 August, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్ పనుల పరిశీలన

16-12-2024 03:44:15 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గచ్చిబౌలి నుండి కొండపూర్ శిల్పా లే ఔట్ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను జీహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి సోమవారం పరిశీలించారు. భూసేకరణ లో ప్రభుత్వ పాఠశాల భవనం కొంత మేరకు  కొల్పోతున్నందున  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సియస్ఆర్ పద్ధతిలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమీషనర్ కు ఆదేశించారు. 

విద్యార్థులకు రోడ్డు కు ఇరువైపులా దాటి  వెల్లె సందర్భంలో  ప్రమాదాలు సంభవించకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి  ప్రతిపాదన లు సిద్దం చేయాలన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను నిర్దేశించిన కాల వ్యవధి లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కమిషనర్ వెంట ప్రాజెక్టు సిఈ దేవానంద్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, యస్ఈ  శంకర్ నాయక్, డిసి ముకుందా రెడ్డి, ఈఈ హరీష్, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.