calender_icon.png 27 August, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-2 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

16-12-2024 03:30:12 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి):  గ్రూప్-2 రెండవ రోజు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. పలు పరీక్షా కేంద్రాలను సోమవారం డిఎస్పీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లోని లోపల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 సెంటర్ ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  జవాబు పత్రాల తరలింపు వరకు పోలీసు బందోబస్తు కొనసాగుతోందన్నారు. రెండవ రోజు 10,428 అభ్యర్థులకు గాను 5774 అభ్యర్థులు హాజరుకగా, 4654 అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.