30-12-2025 12:09:35 AM
మొదలైన ప్రత్యేక కార్యక్రమం
తొలిరోజు ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల క్లీనింగ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. సోమవారం నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలిరో జు నగరవ్యాప్తంగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిల శుభ్రతపై జీహెచ్‌ఎంసీ యంత్రాంగం దృష్టి సారించింది. పాదచారులు ఉపయోగించే వం తెనలను సిబ్బంది క్షుణ్ణంగా శుభ్రం చేశారు. ఈ పనులను ఆయా ప్రాంతాల జోనల్, డిప్యూటీ కమిషనర్లు దగ్గరుండి పర్యవేక్షించా రు. స్పెషల్ డ్రైవ్ అమలు తీరును కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కిస్మత్పూర్, నార్సింగి, సన్ సిటీ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించి, సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలన్నారు.