02-12-2025 01:49:25 AM
ఫిట్‌నెస్ నిరూపించుకుంటే ఛాన్స్
బెంగళూరు, డిసెంబర్ 1 : టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ రీఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడు. కోల్‌కత్తా టెస్టులో మెడనొప్పి తో అర్థాంతరంగా తప్పుకున్న గిల్ నేరుగా హాస్పిటల్‌లో చేరడం, తర్వాత సిరీస్‌కే దూరమవడం చోటు చేసుకుంది. మెడనొప్పి నుం చి పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్‌కు సైతం అతన్ని తప్పించక తప్పలేదు. అయితే గిల్ ఎప్పుడు గ్రౌండ్‌లో అడుగుపెడతాడన్న దానిపై తాజాగా అప్‌డేట్ వచ్చిం ది.
భారత కెప్టెన్ సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది అతను ఫిట్‌నెస్ నిరూపించుకోవడంపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లిన గిల్ అక్కడ ఫిట్‌నెస్ టెస్ట్ ఎదుర్కోనున్నాడు. ఫిట్‌నెస్ టెస్టులో పాసయితే గిల్‌ను టీ20 జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు. నిజానికి అతన్ని ఆడించే విషయంలో బీసీసీఐ తొందరపడడం లేదు. ఎందుకంటే టీ ట్వం టీ ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి రిస్క్ చేయకూదని నిర్ణయించింది.