calender_icon.png 2 December, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేఫ్టీ క్లియరెన్స్ వస్తేనే మ్యాచ్‌లు

02-12-2025 01:46:42 AM

చిన్నస్వామి స్టేడియంపై కర్ణాటక సర్కార్ నిర్ణయం

బెంగళూరు, డిసెంబర్ 1 : ఐపీఎల్ డి ఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సారి కొత్త హోంగ్రౌం డ్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినట్టే కనిపిస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వడంపై సస్పె న్స్ కొనసాగుతోంది. ఆర్సీబీ ఐపీఎల్ టై టిల్ గెలిచిన తర్వాత ఇక్కడ నిర్వహించిన విక్టరీ పరేడ్ కారణంగా 11 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆ ఘటన తర్వాత అక్కడ మ్యాచ్‌ల నిర్వహించడంపై నిషేధం విధించారు. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ యాజమా న్యం ప్రభుత్వ అనుమతి కోరింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కర్ణాటక్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సేఫ్టీ క్లియరెన్స్ నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ నివేదిక ఆధారంగానే మ్యాచ్‌లను అనుమతి ఇవ్వా లా వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ పరిస్థి తులు, స్టేడియం దగ్గర ఉండే రద్దీ వంటి అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.