calender_icon.png 13 May, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయి స్టుల్.. అబ్బాయి స్మైల్

12-05-2025 02:01:07 AM

ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా, సీనియర్ నటుడు శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శనివారం టైటిల్ అనౌన్స్‌మెంట్ చేసిన మేకర్స్ కథానాయకుడి ఫస్ట్‌లుక్‌ను సైతం రిలీజ్ చేశారు. ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతూ ఆదివారం కథానాయిక లుక్‌ను సైతం విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో ఒకవైపు ప్రదీప్ స్మైల్‌తో రిలాక్స్ అవుతుండగా, మమిత స్టులిష్ దుస్తులు, గాగుల్స్‌తో ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇస్తూ కనించారు. ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుందీ సినిమా. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి; సంగీతం: సాయి అభ్యాంకర్.