04-09-2025 12:00:00 AM
రైల్వే పాయింట్స్ మెన్ పనిలో ప్రమాదంతో కూడిన క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. పాయింట్స్‌మెన్ నేరుగా అన్ని రైళ్ల కదలికల భద్రతా కార్యకలాపాలలో పాల్గొంటారు. ప్యాసింజర్ కోచ్‌లు, గూడ్స్ వ్యాగన్‌లను అటాచ్ చేయడం.. వేరు చేయడం (షంటింగ్), అలాగే మార్గ మధ్య స్టేషన్లలో రేక్‌లను స్థిరీకరించడం, భద్రపరచ డం, రైళ్లను బిగించడం, ప్యాడ్ డాకింగ్, పైలటింగ్ చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థను గమనించడం, తప్పులు దొర్లితే సరిచేయడం వ ంటి అనేక విధులు నిర్వహిస్తారు.
అయితే విధులు నిర్వర్తిస్తున్న స మయంలో వివిధ విభాగాల్లో ఒక్క సంవత్సరంలో దాదాపు 18 మంది పాయింట్స్‌మెన్‌లు డ్యూటీలోనే ప్రాణాలు కోల్పోయారు. పాయింట్స్‌మెన్ డైరెక్ట్ రైలు కదలికల్లో పాల్గొంటూ 12 గంటలకు పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 1961లో పాయింట్‌మెన్‌ల కోసం ఎసెన్షియలీ ఇం టర్‌మిటెంట్ రోస్టర్ అమలు చేశారు. తక్కువ పని ఉన్నప్పుడు ఇ ది సాధ్యమయ్యేది.
కానీ ఇప్పుడు పెరిగిన ట్రాఫిక్‌ను ఎదుర్కోవడం కష్టంగా మారుతుంది. ఇది ఒక షిఫ్ట్‌లో 100 రైళ్ల వరకు ఉంటుంది. వారి పనిని ఇకపై రోస్టర్ గా వర్గీకరించకూడదు. 12 -గంటల రోస్టర్‌తో తగినంత విశ్రాంతి కల్పించాలి. వీక్లీ ఆఫ్ ఇచ్చి కుటుంబంతో సమయం గడిపేందుకు అవకాశమివ్వాలి. పాయింట్‌మెన్ కేటగిరీ కి 8- గంటల డ్యూటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వేణు మాధవ్, హైదరాబాద్