31-01-2026 01:22:05 AM
అపోలో ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ ప్రారంభం
అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, జనవరి 30(విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య రంగంలో కీలక పరిణామాలకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. అపోలో హాస్పిటల్స్ నిర్వహిస్తున్న 13వ ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ 2026 హైటెక్ సిటీ నోవోటెల్‌లో ఘనంగా ప్రారంభమైంది. ‘గ్లోబల్ వాయిసెస్ వన్ విజన్’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభించింది.ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన 5 మంది ఆరోగ్య మంత్రులు, వైద్య నిపుణులు, పాలసీ మేకర్లు, హెల్త్‌కేర్ లీడర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రత్యక్షంగా 5,500 మందికి పైగా డెలిగేట్లు హాజ రుకాగా, మరికొందరు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు.
భారతదేశంతో పాటు అనేక దేశా ల నుంచి డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు ఈ సమావేశానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ జా యింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగితా రెడ్డి మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా ఈ హెల్త్ డైలాగ్ ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని ఇతర హెల్త్‌కేర్ సంస్థలతో పంచుకుంటూ, మొత్తం ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సదస్సుకు జాయింట్ కమిషన్, జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్, ఐఎస్క్యూఏతో పాటు సుమారు 17 అంత ర్జాతీ య సంస్థలు మద్దతు అందిస్తున్నాయి. ఒక ఆరోగ్యవంతమైన ప్రపంచం ఒక విజన్ లక్ష్యంగా, అనేక దేశాల గొంతులు ఒకే వేదికపై కలిసి, టెక్నాలజీ, జ్ఞానం, సైన్స్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ హెల్త్ డైలాగ్‌లో ఒకే సారి నాలుగు అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్, ట్రాన్స్‌ఫార్మింగ్ హెల్త్‌కేర్ విత్ ఐటీ, హోప్ హెల్త్‌కేర్ ఆపరేషన్స్ అండ్ పేషెంట్ ఎక్స్పీరియెన్స్, క్లినికల్ లేటెస్ట్ ఇన్నోవేషన్స్ నిర్వహిస్తున్నారు.