31-01-2026 01:20:24 AM
పాల్వంచ 43వ వార్డులో నామినేషన్ అందజేసిన గడ్డం రమేష్
హైదరాబాద్, జనవరి 30(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పాల్వంచ 43 వా ర్డుకు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ(టీఆర్పీ) అభ్యర్థి గడ్డం రమేష్ శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్పీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి బందారపు నర్సయ్యగౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మల్లెల వీరనారాయణ, బొడ్డు ఏసుబాబు పటేల్, మహిళా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రమేష్ తన నామినేషన్ పత్రాన్ని ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వీపురి స్రవంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గౌడ్‌తదితరులున్నారు.