calender_icon.png 4 May, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకింగ్‌కు వెళ్తే 2.87 కోట్ల నిధి లభ్యం

04-05-2025 12:28:21 AM

19వ శతాబ్దానికి చెందినవిగా గుర్తింపు

న్యూఢిల్లీ, మే 3: హైకింగ్‌కు వెళ్లిన ఇద్దరికి అదృష్టం కాళ్ల వద్దకు వచ్చింది. విహారయాత్రలో భాగంగా దట్టమైన అడవిలో నడుస్తూ వెళ్తుండగా రూ.2.87 కోట్ల నిధి లభించింది. చెక్ రిపబ్లిక్‌లో ఇద్దరు వ్యక్తులు హైకింగ్ చేసుకుంటూ ఈశాన్య పోడ్‌క్క్రోనోసి పర్వతాల లోని అడవిలోకి వెళ్లారు.

లా వారు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లిన తర్వాత, ఓ ప్రదేశంలో వారి కాళ్ల కింద ఏదో ఉందని అనిపించింది. గట్టిగా అడుగులు వేయడంతో శబ్దం వచ్చింది. కొంతమేర భూమి పొరను తీసి చూడగా అందులో 598 బం గారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచు లు కనిపించాయి. అనంతరం, వాటిన ఈస్ట్ బోహేమియా మ్యూజియం వారు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నిధి ఫిబ్రవరిలో లభించగా, తాజాగా మ్యూజియం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ నిధిలో లభించిన వాటి విలువ సుమారు రూ.2.87 కోట్లు ఉంటుందని మ్యూజియం అధికారులు అంచనా వేశారు. ఈ నిధిలోని అమూల్యమైన వస్తువులు క్రీస్తుశకం 19వ శతాబ్దం నాటివని వెల్లడించారు. 1921లో వీటిని భూమిలో పాతిపెట్టారని పేర్కొన్నారు. ఇక ఈ నిధిలో ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఓల్డ్ ఆస్ట్రియా నుంచి వచ్చిన కరెన్సీ కూడా ఉంది.