calender_icon.png 1 October, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గాదేవిగా భద్రకాళి అమ్మవారు

01-10-2025 01:04:34 AM

హనుమకొండ, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రులు తొమ్మిదవ  రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4 గంటలకు నిత్యహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని దుర్గగా అలంకరించి పూజారాధనలు జరిపారు. ఈ రోజు భద్రకాళీ జన్మోత్సవం.  కృష్ణాష్టమి వలెనే ఈ రోజు రాత్రి కూడా అమ్మవారికి విశేష అభిషేక అర్చనాదులు, జపహోమలు జరుపుతున్నారు.

మంగళవారం అమ్మవారి విశేష అలంకరణకు గండ్ర భూపాల్ రెడ్డి రూపా దంపతులు  గండ్ర అభిలాష్ రెడ్డి దివ్య దంపతులు గండ్ర సాయి కృష్ణారెడ్డి భావనాంజలి దం పతులు, భారతి విద్యా సంస్థల అదినేతలు ఇరుకుళ్ళ సంజయ్ కుమార్-జయశ్రీ దంపతులు, డాక్టర్ పోతాని రాజేశ్వర ప్రసాద్, డాక్టర్ లలితా దేవి దంపతులు కాపర్తి వీర వెంకటయ్య, బాలకృష్ణ వేణి దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. 

పూజనంతరం ఉభయ దాతలకు ఆలయ ఈ.ఓ  రామల సునీత శేష వస్త్రములు బహుకరించి ప్రసాదములు ఆందజే శారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ ఉప కమిషనర్ కె ఎన్ సంధ్యారాణి తదితరులు ఉన్నారు.

ఆలయానికి విచ్చేసిన డిప్యూటీ కమిషనర్ కు ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు పూజానంతరం మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి ప్రసాదములు అందజేశారు అనంతరం డిప్యూటీ కమిషనర్ నవరాత్రుల ఏర్పాట్లను పరిశీలించారు. సాయంకాలం  దేవాలయ ప్రాంగణంలో  మహిళలు బతుకమ్మను ఆడారు.