01-10-2025 01:05:50 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పిలుపునిచ్చారు.ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, (ఎన్నికల నియమావళి) నీ పాటిస్తూ ఎన్ని కలు సజావుగా నిర్వహణకు సహకరించాలన్నారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి తీసుకో వలసిన చర్యలు, నామినేషన్ల ప్రక్రియ, స్కూటీని, ఖర్చుల వివరాలు, ఎన్నికలు నిబంధనలు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రేనర్స్ ప్రవీణ్ వివరించారు.
మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ సిపిఓ అశోక్, బ్యాలెట్ బాక్స్ మేనేజ్మెంట్ డిపిఓ హరిప్రసాద్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ఆర్టీవో జైపాల్ రెడ్డి, ట్రైనింగ్ మేనేజ్మెంట్ డిఇఓ దక్షిణామూర్తి, మెటీరియల్ మేనేజ్మెంట్ అదనపు కలెక్టర్ రెవిన్యూ అనిల్ కుమార్, ఎక్స్పెండిచర్ వెంకటేశ్వర్లు, అబ్జర్వర్ మేనేజ్మెంట్ డీఎం సివిల్ సప్లై కృష్ణవేణి, బ్యాలెట్ పేపర్ డిఆర్డిఓ మధుసూదన రాజు, మీడియా కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ డిపిఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, హెల్ప్లైన్ గ్రీవెన్స్ పుల్లారావు, నివేదికలు సమర్పణ జెడ్పి సీఈవో పురుషోత్తం, ఎంసిఓసి, ఎక్స్పెండిచర్ అకౌంట్స్, మానిటరింగ్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, హౌసింగ్ పీడీ హనుమ, నియమించడం జరిగింది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున అధికారులు నియమించడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎస్ ఎస్ టి, వీడియో వింగ్ తదితర ఎన్నికల నిర్వహణ కమిటీలకు ప్రత్యేక అధికారులను నియమించి ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కే.అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ నాయుడు, బిఆర్‌ఎస్ నుంచి మార్నేని వెంకన్న, బిజేపీ నుంచి కె.శ్యామ్ సుందర్, మలోత్ బాబు, టిడిపి నుంచి పి.బి.రామా రావు, సిపిఐ నుంచి టి.సందీప్, జడ్పీ సీఈవో పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, పర్యవేక్షలు రాఘవ రెడ్డి, మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.