calender_icon.png 2 October, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైసియా ఆధ్వర్యంలో సుస్థిరాభివృద్ధి సదస్సు

02-10-2025 12:00:00 AM

ముషీరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాం తి): హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంట్ర్పజెస్ అసోసియేషన్(హైసియా) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్‌ఐసీసీలో సుస్థిరాభివృద్ధి సదస్సు-25తో పాటు అవార్డుల కార్యక్రమం నిర్వ హించినట్లు హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెళ్ల బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముందుగా సెర్ప్ సీఈఓ, ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ ఎన్జీవో ఎక్స్పో ను ప్రారంభించారని తెలిపారు.

హాజరైన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ అర్థవంతమైన అభివృద్ధికి పరిశ్రమ, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం అన్నారు. ఇన్ఫోసిస్ హైదరాబాద్ డీసీ అధిపతి రఘు బొడ్డుపల్లి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ మనీషా సాబూ, కాగ్నిజెంట్ ఫౌండే షన్ సీఈఓ దీపక్ ప్రభు మట్టి, ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఎమెరిటస్ రామం ఆత్మకూరి పాల్గొన్నారు.