calender_icon.png 8 August, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం

07-08-2025 12:08:22 AM

 డిప్యూటీ సెక్రటరీ భీమ్ సింగ్ 

 సూర్యాపేట ఆగస్టు 6 (విజయక్రాంతి) : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని  ఇంటర్మీడియట్ బోర్డ్ డిప్యూటీ సెక్రెటరీ భీమ్ సింగ్ అన్నారు. బుధవారం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి కృషి చేస్తుందని తెలిపారు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల ప్రకారం ఈ నెల లో గతంలో 47 వేల అడ్మిషన్లు ఉండగా ఇప్పుడు 97 వేలకు పెరిగింది అన్నారు.

గతం కన్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని వివరించారు కళాశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భౌతిక శాస్త్రానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు అధ్యాపకులు అంకితభావంతో కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఏ కళాశాలలో  అయినా అవసరమైన ఏర్పాట్లకు ఇప్పటికే పండు రిలీజ్ అయిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రైవేటు కళాశాలలో ఉన్న విద్యార్థులు బీసీలు గవర్నమెంట్ కళాశాలల్లో ఇచ్చినట్లయితే వారికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ కళాశాల బలోపేతానికి చేస్తున్న కృషికి అందరూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు త్వరలో  విద్యార్థుల తో మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల యొక్క స్థితిగతులను వారికి వెల్లడించాలని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేసింది అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతుల సిబ్బంది పాల్గొన్నారు