calender_icon.png 7 May, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభం గీతాలాపన

04-05-2025 12:00:00 AM

ప్రముఖ నటి సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలిచిత్రం ‘శుభం’. తన సొంత సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఫస్ట్‌సింగిల్ ‘జన్మజన్మల బంధం’ను శనివారం విడుదల చేశారు.

ఇది ప్రమోషనల్ వైబ్ కోసం రూపొందించిన ఓ ఎనర్జిటిక్ రీమిక్స్ సాంగ్. ఇందులో నిర్మాతతోపాటు ప్రధాన తారాగణం కనిపించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో మాతాజీగా దర్శనమిచ్చిన సమంత ఈ పాటలో ధూంధాంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.