calender_icon.png 7 May, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ సేవలతో వినోద ప్రపంచాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలి

04-05-2025 12:00:00 AM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

దిల్ రాజు ‘లోర్వెన్ ఏఐ స్టూడియో’ ప్రారంభోత్సవం 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియో ప్రారంభించారు. శనివారం నిర్వహించిన ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరు కాగా, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పా ల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు మా ట్లాడుతూ.. “దిల్ రాజు మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు లోర్వె న్ ఏఐ స్టూడియోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది.

ఆయన ఈ ఏఐ స్టూడియోతో వినోదపు ప్రపంచాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలి. తెలంగాణ టెక్నాలజీ డ్రివెన్ స్టేట్. మూడు దశాబ్దాలుగా మనం లీడర్స్ ఆఫ్ టెక్నాలజీ అని ఈ వరల్డ్‌కి ప్రూవ్ చేసుకున్నాం. హాలీవుడ్‌కు ధీటుగా హైదరాబాద్ ఎదుగుతోంది. ఈ టెక్నాలజీని మూవీతో బ్లెండ్ చేయడమనేది ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ లెవెల్ స్టెప్. అధునాతన టెక్నాలజీతో కొత్త అవకాశాలు తెరపైకి వస్తాయి’ అన్నారు. నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ.. ‘360 డిగ్రీస్ సినిమాను ఎలా చేయొచ్చు అనేది క్రియేటివ్‌గా డెవలప్ చేశాం.

స్క్రిప్టు ఐడియా నుంచి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యేవరకు ఒక స్టేజ్. తర్వాత ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ ప్రాసెస్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఇలా స్టెప్ బై స్టెప్‌గా డెవలప్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్లో డైరెక్టర్ ఏది అనుకుని సినిమాని తీశాడు ఫైనల్ కట్ సినిమా చూడొచ్చు. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్‌లో డైరెక్టర్‌కు టైమ్ సేవ్ అవుతుంది. టైమ్ సేవ్ అవ్వడం వల్ల దర్శకులు ఇంకా ఎక్కువ సినిమాలు తీస్తారు. ప్రొడ్యూసర్స్‌కి టైం సేవ్ కావడం వల్ల మనీ సేవ్ అవుతుంది.

విజయ్ దేవరకొండతో ‘రౌడీ జనార్ధన’ సినిమా తీస్తున్న డైరెక్టర్ రవికిరణ్ ఇందులో వర్క్ చేస్తున్నాడు. తన స్క్రిప్టు ప్రీ ప్రొడక్షన్ ఇందులోనే జరుగుతుంది. ‘తెల్ల కాగితం’ అనే సినిమా, ఒక వీఎఫ్‌ఎక్స్ సినిమా వర్క్  ఇందులోనే జరుగుతుంది. ఒక స్క్రిప్ట్‌ను కూడా ఇందులోనే డెవలప్ చేస్తున్నాం. దీన్ని అందరికీ ఉపయోగపడేలా డెవలప్ చేస్తున్నాం. ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం. మా కంపెనీ కాకుండా మిగతా ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ హౌసెస్ ‘లోర్వెన్ ఏఐ’ కావాలనుకుంటే సంప్రదించొచ్చు’ అన్నారు. వైఘా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఇది డ్రీమ్ కం ట్రూ మూమెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ ఒకదానికొకటి ముడి వేసుకుంటూ ముందుకు వెళుతుంది’ అన్నారు.