calender_icon.png 7 January, 2026 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బు పెట్టు.. సెలక్షన్ పట్టు!

05-01-2026 01:26:22 AM

కరీంనగర్, జనవరి 4 (విజయక్రాంతి): నేటి రోజులలో క్రీడలు ఆడాలంటే క్రీడాకారులు లేరు కానీ ఎక్కడో అక్కడ కొంతమంది మాత్రమే క్రీడాకారులు తయారవుతున్నారు ఆ తయారవుతున్న దానిలో క్రీడలని నమ్ముకొని ముఖ్యంగా వాలీబాల్ క్రీడనీ నమ్ముకున్న క్రీడాకారులు రాత్రి పగలు అనకుండా కష్టపడుతూ క్రీడను నేర్చుకుంటున్నారు. కానీ ఇట్టి సమయంలో సెలక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ క్రీడను నమ్ముకుని క్రీడాకారుడు తన యొక్క ప్రతిభను చూపించినప్పుడు అట్టి ప్రతిభను లెక్కచేయకుండా  వాలీబాల్ క్రీడను డబ్బుతో పర్పత్తో ముడి వేస్తున్నారు. వాలీబాల్ అసోసియేషన్ వారు ఇలా చేయడం ద్వారా వాలీబాల్ క్రీడా కనుమరుగవుతుందని  మరొక క్రీడాకారుడు తయారు కావడానికి ఉత్సాహం చూపించలేకపోతున్నారు.

వాలీబాల్ క్రీడ ఆడాలంటే నేడు డబ్బు ఉండాలి పర్పత్ అయినా ఉండాలి. క్రీడలను డబ్బుతో ముడి పెట్టడం  ద్వారా  క్రీడతో పాటు క్రీడా అసోసియేషన్ వారు ఎంతో అవమానంతో కూడుకున్నారు. ఇలా చేయడం ద్వారా క్రీడాకారులు వాలీబాల్ ఆడాలంటే.. డబ్బు పెట్టు సెలక్షన్ పట్టు అని అంటున్నారు. డిసెంబర్ 13 నుంచి 16 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్‌ల రాష్ట్ర జట్టు ఎంపిక జరిగింది. ఈ టోర్నమెంట్లో అనేక కారణాలు చెప్పి కొంతమంది క్రీడాకారులను టోర్నమెంట్ ఆడనీయలేదు. అలాగే టోర్నమెంట్ ఆడిన మంచి క్రీడాకారులు సెలక్షన్ కాలేరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన ఇద్దరు మంచి క్రీడాకారులను సెలక్షన్ చేయలేదు.

రాష్ట్రంలో 8 మంది క్రీడాకారులు వివిధ కారణాలతో జట్టులోకి తీసుకోలేదు. గుర్తింపు లేని వాలీబాల్ సంఘానికి రాష్ట్రంలో గుర్తింపు లేని ఒలంపిక్ మరియు మన రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ దీనికి వత్తాసు పలుకుతుంది. నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది.ఒకప్పుడు జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు వెలుగొందారు. ఠాకూర్ దుర్గరాజ్ సింగ్ సీనియర్ సౌత్ జాయిన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు కాకతీయ శాతవాహన విశ్వవిద్యాలయ తరఫున పాల్గొన్నారు జియా ఉల్ రెహమాన్ ఖాన్ కాకతీయ విశ్వవిద్యాలయం  అమీర్ అలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరపు నా సబ్ జూనియర్ నేషనల్  శాతవాహన విశ్వవిద్యాలయం తెలంగాణ జట్టు తరుపున యూత్ నేషనల్ మరియు సీనియర్ నేషనల్లో ఆడారు. ప్రస్తుత సెలక్షన్ తీరువల్ల నైపుణ్యం గల క్రీడాకారులు తెరమీదికి రావడం కష్టమే.

ప్రభుత్వం దృష్టి సారించాలి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి దీనిపై దృష్టి సాధించాలని మా క్రీడాకారుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నిక విధానంలో మార్పులు తేవాలి. గ్రామీణ స్థాయి నుండి వాలీబాల్ క్రీడను అభివృద్ధి చేసి క్రీడాకారులను తయారు చేయాలి. ఎంపిక విధానం పారదర్శకంగా ఉండాలి.

రోడ్డ శ్రీధర్, జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు