05-01-2026 01:46:29 AM
నీకున్నది ఒకే తల.. నువ్వెంతా?
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై మాజీమంత్రి జీవన్‌రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు
కరీంనగర్, జనవరి 4 (విజయక్రాంతి): జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిల మధ్య మగ్గుతున్న విభేదాలు మరోమా రు బహిర్గతమయ్యాయి. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సంజయ్‌కుమార్‌ను ఉద్దేశించి పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు. ధర్మాన్ని నమ్ముకున్న రాముడే రావణుడి పది తలలు నరికాడు..
నీకున్నది ఒకటే తల.. నువ్వెంత.. మాకు ఎవరైనా అడ్డం వస్తే నరుకుతాం అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ‘రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి పార్టీలోకి వచ్చావు. నువ్వు ఎంత? ఒక తలకాయ’ అంటూ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశా రు. జీవన్‌రెడ్డి వ్యాఖ్యల్లో ప్రధానంగా ప్రతిఫలించిన అంశం.. కార్యకర్తల హక్కు లు. కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకే టిక్కెట్లు ఇవ్వాలని, కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడూ జెండా పట్టని వారు కాంగ్రెస్‌లోకి రావడం సహించబోమని, కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదు అనే వ్యాఖ్యలు పార్టీ లోపల స్పష్టమైన గీత గీసినట్లయ్యాయి.
రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టార్గెట్ 50 అంటూ 50 వార్డుల్లో గెలిచి జగిత్యాల మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యం అని జీవన్‌రెడ్డి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలే రథసారథులని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలన్నీ నేరుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఉద్దేశించినవే కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
సంజయ్‌కుమార్ గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జగిత్యాల రాజకీయాల్లో కీలక మలుపు. అయితే కాంగ్రెస్‌లోకి వచ్చిన వెంటనే, నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా భావించబడుతున్న జీవన్‌రెడ్డికి సంజయ్ కుమార్ కంటగింపుగా మారారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
ఇరువురి మధ్య విభేదాలు ఒక్కరోజులో ఏర్పడినవి కావు. స్థానిక సంస్థల్లో నియామకాలు, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం, స్థానిక, మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, కార్యకర్తల పాత్ర వంటి అంశాల్లో గతంలోనే పలుమార్లు మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న భావన జీవన్‌రెడ్డి వర్గంలో అసంతృప్తిని పెంచింది. మరోవైపు, సంజయ్ కుమా ర్ విస్తృత మద్దతుతో ముందుకు వెళ్లాల్సిందేనని, జగిత్యాల నియోజకవర్గం మద్దతు ఉండాల్సిందే అనే వాదనను వినిపించారు.