05-01-2026 12:57:17 AM
బెల్లంపల్లిలో ఇప్పటికే కొందరు అధికార పార్టీ లీడర్ల అవినీతి, అక్రమాలు ప్రతినిత్యం జిల్లాలో హాట్ టాపి క్‌గా మారిపోయాయి. వాటిపై మీడియాలో కథనాలు సంచలనం రేకిస్తున్నాయి. అయినప్పటికీ కబ్జాలు, అక్రమాలు ఆగడం లేదు... అధికారం మాటున ఎవరికి తోచినట్టు వారు లీడర్లే కబ్జాలను దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా కబ్జాల వ్యవహారంలో తామేమీ తక్కువ కాదని అధికార పార్టీకి చెంది న మరో నేత పట్టణ నడిబొడ్డున గల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా ఇంటి నెంబర్ తీసుకున్న వైనం వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది. మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా, ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఎస్సీ కార్పొరేషన్ సముదాయంపై కబ్జాదారుల కన్ను పడింది.
-కబ్జాస్థలానికి ఇంటి నెంబర్ ఎలా?
-వేలం మరిచిన అధికారులు
-అధికార పార్టీ నేత లీలలు
-కబ్జాలకు అధికారుల అండ
బెల్లంపల్లి అర్బన్, జనవరి 4: బెల్లంపల్లిలో బడుగు బలహీన వర్గాల పిల్లల ప్రయోజనం కోసం 30 సంవత్సరాల కిందట బెల్లంపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ ఆరు రూములను నిర్మించారు. 15 సంవత్సరాల వరకూ ఈ కార్పొ రేషన్ వ్యాపార సముదాయాలను వేలం ప్రకా రం అప్పగిస్తుండేవారు. అందుకు నిబంధనల ప్రకారం తగిన అద్దె అడ్వాన్స్ వసూలు చేసేవారు. అంత వరకు బాగానే ఉంది. పది సంవ త్సరాల నుంచి అధికారులు కాంప్లెక్స్ నిర్వహణను విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. వేలం ద్వారా అప్పగించే కాంప్లెక్స్ కు సంవత్సర కాలపరిమితి. ఈ నిర్ణీత కాలం దాటిన వెంటనే మళ్లీ వేలం వేసి ఇచ్చేవారు. కానీ చాలా కాలంగా అధికారులు వేలానికి సెలవు ప్రకటించినట్లున్నారు. దీనితో నిర్వాహణ గాడితప్పిందనేది స్పష్టమవుతుంది.
ఆదాయానికి గండి..
షాపుల వేలాన్ని నిర్లక్ష్యం చేసి అధికారులు ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు. నెలలు కాదు.. సంవత్సరాల నుంచి వేలం వేయడం మానుకున్నారు. దీంతో లక్షల రూపాయలు ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఉత్త పుణ్యానికి కొందరు ఈ షాపుల్లో చిన్నాచితక వ్యాపారాలు పెట్టుకొని లబ్ధిపొందుతున్నారు. కొందరైతే వాటిని సబ్ లీజుకు ఇచ్చి ఇదోరకమైన మారు వ్యాపారం సాగిస్తున్నారని తెలుస్తుంది.. అధికారులు సక్రమంగా ఉంటే ఇలాంటి తప్పులకు ఆస్కారం ఉండదు.
ఎస్సీ కార్పొరేషన్ ఆస్తులు అధికారులకు బొత్తిగా పట్టింపు లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అధికారులే కాంప్లెక్స్ నిర్వహణపై శ్రద్ధ పెడితే వేలం వేయకుండా ఎలా ఉంటారు... ఇల్లీగల్ గా షాపుల్లో ఎలా ఉంటారు..? ఏమైనా ఆశించి ఆ దుకాణాలను అప్పగిస్తున్నారా..? ఇలా సవాలక్ష అనుమానాలు అధికారుల తీరుపై వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ కబ్జా భూమికి ఇంటి నంబర్ ఎలా...?
ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్ వెనకాల ఉన్న స్థలం కబ్లాకు గురైంది. కాంప్లెక్స్ వెనక ఖాళీ స్థలం కార్పొరేషన్ పరిధిలోనిదైనా లేదా సింగరేణిదైనా కావాలి. ఇది ఎవరి పరిధిలో ఉన్నా అది ప్రభుత్వ ఆస్తి అనేది పక్కా. ముమ్మాటికి ప్రభుత్వానిదే. ఈ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓ నేత చాలా నెలల క్రితమే ఆక్రమించుకున్నాడు. తన పలుకుబడిని ఎరగా వేసి ఇంటి నెంబర్ కూడా సంపాదించాడు. అందుకుగాను 2025 నుంచి ఆస్తి పన్ను కూడా మున్సిపాలిటీకి చెల్లిస్తున్నాడు. ప్రభుత్వ భూమికి మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్ ఇవ్వడం అధికారుల అవినీతిని మరోసారి బయటపెట్టినట్లైంది.
కబ్జా భూమికి ఇంటి నంబర్ (20-3-45)ను తీసుకున్నాడు. భార్యది భర్తకు కావాలన్నా, తల్లిదండ్రులది కొడుకులకు కావాలన్నా డాక్యుమెంట్స్ సరైనవి చూపిస్తేనే ఇంటి నంబర్ ఇస్తారు. అదేమి లేకుండా నంబర్ ఎలా సాధ్యమనే దానిపై చర్చ జరుగుతుంది. అందులో అతను బీసీ సామాజిక వర్గం. అధికారులు అతడికి ఎలా ఇంటి నంబర్ ఇచ్చారనేదే ఇక్కడ అక్రమాలను స్పష్టం చేస్తుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవా లని పలువురు దళితులు కోరుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ షాపుల వ్యవహారం, కబ్జా భూమిపై విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
దుకాణాల వేలం ఏదీ..?
బెల్లంపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్‌కి ఎదురు గా ఆరు షాపులతో కూడిన వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. వేలాన్ని ఎస్సీ కార్పొరేషన్ విది విధానాల మేరకు వేసి అప్పగించాల్సి ఉంటుంది. కానీ సం బంధిత శాఖ అధికారులు దశాబ్ద కాలం గా వేలం వేయడం లేదు. అందులో ఎవరుంటున్నారు, వారి నుంచి అద్దె వసూ లు చేస్తున్నారో, లేదో తెలియదు. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లేదన్నది స్పష్టమవుతుంది.