17-09-2025 12:39:46 AM
కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాళ్ల సమావేశం
నిజామాబాద్ సెప్టెంబర్16:( విజయక్రాంతి): ప్రిన్సిపాల్ లు బాధ్యతాయుతంగా పనిచేస్తూ మంచి ఫలితాలను సాధించేందుకు.. ఇప్పటి నుండే ఆచరణాత్మక ప్రణాళిక బద్ధంగా విద్యా బోధనపై దృష్టి సారించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రీ వినయ్ కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, సాంఘిక సంక్షేమ, గురుకుల, మోడల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశం జరిగింది.
జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమల పూడి రవికుమార్ మాట్లాడుతూ ఇంటర్ విద్య కమిషనర్ ఆదేశాల మేరకు మొదటి సంవత్సరం అడ్మిషన్లు, యుడైస్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం, గత సంవత్సరం ఫలితాల పై సమీక్ష నిర్వహించారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరం కు గాను మంచి ఫలితాలు సాధించడానికి ప్రణాళిక బద్దంగా పనిచేయడానికి కార్యోన్ముఖులు కావాలని అన్నారు.
ఇంకా విద్యార్థుల ఫేసియల్ రికగ్నిషన్ సిస్టం పూర్తికాని కళాశాలలో ప్రతి ప్రిన్సిపల్ ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి చేయాలని అన్నారు అలాగే విద్యార్థుల యుడైస్, అపార్, పెన్ నంబర్లను పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏవేని సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే జిల్లా ఇంటర్ విద్యా అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి తమ సిద్ధంగా ఉంటామని జిల్లా ఇంటర్ విద్యార్థి గారి స్పష్టం చేశారు.