17-09-2025 12:39:57 AM
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి హీర్యా నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌తో స్టాల్స్ ఏర్పరుచుకొని వచ్చిన ఉపాధ్యాయులకు అతిథులకు ప్రదర్శనలతో వివరించారు.
ఈ ప్రదర్శనలో తెలుగు నుండి మొదటి బహుమతి ఎంపియుపిఎస్ ఉప్పరిగూడ, రెండో బహుమతి ఎంపీపీఎస్ ఇబ్రహీంపట్నం, మూడవ బహుమతి ఎంపీపీఎస్ ఆదిభట్ల, ఇంగ్లీష్ నుండి మొదటి బహుమతి ఎంపీపీఎస్ వి.ఆర్ కాలనీ, రెండవ బహుమతి ఎంపీయుపిఎస్ ఇబ్రహీంపట్నం, మూడో బహుమతి ఎంపీపీఎస్ దండుమైలారం, మాథ్స్ నుండి మొదటి బహుమతి ఎంపీపీఎస్ చర్ల పటేల్ గూడ, రెండో బహుమతి ఎంపీపీయూపీఎస్ రాందాస్ పల్లి, మూడవ బహుమతి ఎంపీహెచ్‌ఎస్ నాగన్ పల్లి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ (ఈవీఎస్) నుండి మొదటి బహుమతి ఎంపీపీఎస్ వి.ఆర్ కాలనీ, రెండవ బహుమతి ఎంపీయుపిఎస్ కప్పపహాడ్, మూడవ బహుమతి ఎంపీపీఎస్ కె.వి.వి తండా లకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం.వెంకట్ రెడ్డి, కె.శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.