27-10-2025 12:49:45 AM
స్టార్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ఓ హిస్టారికల్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘గోపీచంద్33’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూళ్లకు సంబంధించి 55 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం హీరో గోపిచంద్‌తోపాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. విభిన్నమైన కథలతో, సాంకేతిక నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రంతో భారత చరిత్రలోని ఓ ముఖ్యమైన అధ్యాయాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నారు.
ఈ సినిమాలో గోపిచంద్ తన కెరీర్‌లో ఎన్నడూచేయని విభిన్నమైన పాత్రలో యోధుడిలా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అనుదీప్‌దేవ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.