calender_icon.png 27 October, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారితే.. నెపోలియన్ రిటర్న్స్

27-10-2025 12:51:22 AM

ఆనంద్ రవి దర్శకత్వంలో ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్త ఓ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటర్న్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్, గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఆదివారం జరిగింది.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకులు వశిష్ట, సాయిరాజేశ్, వంశీ నందిపాటి, అనిల్ విశ్వంత్ అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ ఆనంద్ రవి మాట్లాడుతూ.. “పేరెంట్స్’, ‘ప్రతినిధి’, ‘నెపోలియన్’, ‘కొరమీను’ చిత్రాలు తీశాను. కానీ సరైన విజయం, గుర్తింపు రాలేదు. కానీ ‘నెపోలియన్ రిటర్న్స్’తో నాకు సక్సెస్, మంచి గుర్తింపు వస్తుంది.

సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది. తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌తో ఇంతవరకు ఎక్కడా సినిమా రాలేదు” అన్నారు. నటి దివి మాట్లాడుతూ..“నెపోలియన్’ తర్వాత ఆనంద్ రవిని కలిశాను. ఆనంద్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది” అని తెలిపింది. చిత్ర నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ.. “ఆనంద్ ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు. ఏడాదిన్నరపాటు ప్రీప్రొడక్షన్ కోసమే పనిచేశారు.

మంచి సబ్జెక్ట్‌తో అందరి ముందుకు రాబోతోన్నాం” అని చెప్పారు. దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ.. “నేను ఆనంద్ రవి కోసమే వచ్చాను. ఆయన నీడ పోయిందని ‘నెపోలియన్’ తీశాడు. ఇప్పుడు ‘నెపోలియన్ రిటర్న్స్’ అంటూ జంతువుల ఆత్మతోనూ కథ రాసుకోవచ్చని ఇప్పుడు కొత్త ఐడియా ఇచ్చాడు.

ఈ సినిమా కథ నాకు ముందు చెప్పాడు. సినిమా అద్భుతంగా ఉండబోతోంది. ‘నెపోలియన్ రిటర్న్స్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.