calender_icon.png 30 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓజీ టికెట్ ధరలను వెంటనే తగ్గించండి

30-09-2025 01:24:40 AM

పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా టికెట్లను తొలిరోజు నుంచే నిర్ణీత అదనపు ధరలకు విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తూ జీవో జారీ చేసింది.

అయితే, తాజాగా ఆ జీవో రద్దయింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసుశాఖ ప్రత్యేక జీవోను విడుదల చేసింది. తాజా ఆదేశాలను వెంటనే అమలుచేయాలని సింగిల్ స్క్రీన్లు, మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలకు సూచించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపును హైకోర్టు సస్పెండ్ చేయడం.. ఆ తర్వాత పరిణామాలను జీవోలో పేర్కొంది.