calender_icon.png 24 December, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించాలి

24-12-2025 01:25:02 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించుకొని ముందుకు సాగాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. టిటిఏ తెలంగాణ  అమెరికా తెలుగు సంఘం టిటిఏ సేవ డేస్ కార్యక్రమంలో భాగంగా  బైనగారి నరేష్ ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి పోచారం సర్కిల్ పరిధిలోని కొర్రెముల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డైనింగ్ హల్, మక్త లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే మల్లారెడ్డి మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ముందే లక్ష్యాన్ని ఎంచుకొని విద్యతో పాటు క్రీడల పట్ల శ్రద్ధ వహించి రెండిట్లో రాణించాలని పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా మంచి ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని, చెడువ్యసనాల పట్ల ఆకర్షితులు కాకూడదని సూచించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమలను విక్షించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ లు ఓరుగంటి వెంకటేష్ గౌడ్, బైరు రాములుగౌడ్, డొంకెని బిక్షపతిగౌడ్, మాజీ ఉపసర్పంచ్ కందుల రాజు, కుర్ర మహేందర్ గౌడ్,  మాజీ ఎంపిటిసిలు బొడ్డు వినోద, మేకల నర్సింగ్ రావు, బిఆర్‌ఎస్ నాయకులు పన్నాల కొండల్ రెడ్డి, నాగులపల్లి రమేష్, మహేంద్రచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.