27-09-2025 12:29:40 AM
రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు
వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలెర్ట్
మిగతా జిల్లాలకు అరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ
పలు ప్రాంతాల్లో 21 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేయగా, మిగతా జిల్లాలకు ఆరెం జ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కి.మీ.ల ఎత్తులో కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. మరోవైపు బంగళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీనిప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
శనివారం నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామా రెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మం చిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యా పేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి,
నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లా ల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులు గంటకు 40 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం నాడు ఆదిలా బాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,
రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెద క్, కామా రెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగు లాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.