24-09-2025 12:54:13 AM
తలకొండపల్లి, సెప్టెంబర్ 23: సొప్ప గడ్డి కటింగ్ మిషన్లో పడి చేతిని కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితున్ని మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరమార్శించారు.తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామానికి చెందిన తడిసిన లక్ష్మారెడ్డి ఆదివారం తన వ్యవసాయ పొలంలో పాడి ఆవుల మ్యాత కోసం సొప్పను కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఎడమ చేయి కటింగ్ మిషన్లో పడి కట్ ఐయింది.
వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెల్దండ సమీపంలోని ఎన్నం ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వార విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న లక్ష్మారెడ్డి ని పరమార్శించారు.డాక్టర్ల తో మాట్లాడి లక్ష్మారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ప్రదీప్ రెడ్డి, అజీజ్, శ్రీనివాస్ రెడ్డి లు ఉన్నారు.