12-08-2025 12:00:00 AM
- అంబేద్కర్ వల్లే ప్రత్యేక తెలంగాణ
- అచ్చంపేటలో నూతన మునిసిపల్ కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో మంత్రి వివేక్.
అచ్చంపేట ఆగస్టు 11 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన మునిసిపల్ కార్యాలయ భవనాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమక్షంలో నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
గత పదేళ్ల కాలంలో అవినీతి అక్రమాలు అహంకారపూరిత ప్రభుత్వమే నడిచిందని ప్రస్తుతం ప్రజా సమస్యల ఎజెండాగా సంక్షేమ పథకాలను ఈ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు. పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలకు మెరుగైన మునిసిపల్ సేవలందించేందుకు ఈ కొత్త భవనం దోహదపడుతుందన్నారు.
స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ నిబద్ధత నిజాయితీకి మారుపేరుగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడని తాను అనుకున్న పనిని సాధించేదాకా పట్టు వదలడని పేర్కొన్నారు. అనంతరం బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం గ్రామపంచాయతీ భవనం సిసి రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు.