12-09-2025 01:13:30 AM
-సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్-1 విద్యార్థుల నిరసన
-బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనియాస్ యాదవ్
ముషీరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): గ్రూప్ పరీక్షల అవకతవకులపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని బిఆర్‌ఎస్ విద్యార్థి భాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ వద్ద గ్రూప్-1 విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీపీఎస్సీ తప్పిదం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గ్రూప్ వన్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయన్నారు. తప్పిదాన్ని గమనించిన హైకోర్టు గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాలను రివాల్యుయేషన్ చేయాలని లేదా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టిజిపిఎస్సి కి ఆదేశాలు జారీ చేసిందన్నారు.
టీజీపీఎస్సీ తప్పిదం వల్లే విద్యార్థులు నష్టపోయారని దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ గ్రూప్ వన్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామన్నారు.
లైబ్రరీ వద్ద స్వల్ప ఉద్రిక్తత....
లైబ్రరీ లోపల నిరసన కార్యక్రమాలు చేయొద్దని, చదువుకునే విద్యార్థులకు ఇ బ్బంది కలుగుతుందని నిరసన కార్యక్రమం చేపట్టిన బిఆర్‌ఎస్వి నాయకులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ వినకపోవడంతో ఆందోళన చేస్తున్న బీ ఆర్ ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తో పాటు మిగితా నేతలను అరెస్ట్ పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.