calender_icon.png 12 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాపఖ్వాడాను విజయవంతంగా నిర్వహించాలి

12-09-2025 01:11:45 AM

బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి  

నల్లగొండ టౌన్, సెప్టెంబర్11 (విజయక్రాంతి): సేవా పఖ్వాడా కార్యక్రమం జిల్లాలోని  అన్ని మండలాల్లో విజయవంతంగా నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి   అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బిజిపి జిల్లా కార్యాలయంలో జరిగిన  సేవా పఖ్వాడా జిల్లా కార్యశాల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

సమాజంలో డ్రగ్స్ నిర్మూలనతో పాటు రక్తదాన ప్రాముఖ్యత, సేవా కార్యక్రమాల ఆవశ్యకత వివరిస్తూ స్ఫూర్తిని కలిగించాలన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్ర విమోచన దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడంతోపాటు ప్రధాని  నరేంద్ర మోదీ  ప్రభుత్వం గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేసేలా కార్యక్రమాల ద్వారా తెలియజేయాలన్నారు. 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బిజెపిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని అలాగే కార్యకర్తలు పోటీకి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాల అభివృద్ధి కోసం అదనంగా నిధులు కేటాయిస్తూ, గ్రామీణ ప్రజల సాధికారత కోసం కృషి మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

ఈ కార్యక్రమంలో  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  వీరెళ్లి చంద్రశేఖర్ ,జిల్లా ప్రధానకార్యదర్శులు పోతెపాక లింగస్వామి , విద్యాసాగర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు శాగ చంద్రశేఖర్ రెడ్డి, వనం నరేందర్ రెడ్డి , మైలం నర్సింహా,  పకీరు మోహన్ రెడ్డి, దేవేందర్ ,జిల్లా కార్యదర్శులు వెంకటేశ్వర్లు గౌడ్ , బాలాజీ నాయక్ ,యువ మోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.