21-08-2025 12:00:00 AM
-కొత్త దిశకు నాందిగా మహిళా పోలీసుల తొలి సదస్సు
-పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మహిళా పోలీసుల ప్రత్యేక అవస రాలను దృష్టిలో పెట్టుకొని వారికి ప్రభు త్వం అండగా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కమిట్మెంట్‌కు, కాన్ఫిడెన్స్‌కు చిరునామాగా తెలంగాణ మహిళా పోలీసులు నిలుస్తున్నారని సీతక్క అభిప్రాయపడ్డారు.
రాజేంద్రనగర్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా పోలీస్ రాష్ర్టస్థాయి తొ లి సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. డైరెక్టర్ జనరల్ అధికారులు అభిలాష బిష్ట్, చారుసిన్హా, శికాగోయల్, స్వాతి లక్రాతోపాటు కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి వరకు సుమారు 400 మంది మహిళా పోలీస్ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి హోమ్ మినిస్టర్‌గా మహిళా శక్తిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మహి ళా పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ఇందిరాగాంధీ 1973లో కేరళలో కోజికోడ్‌లో దేశంలోని తొలి మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారన్నారు. ఒకప్పుడు పోలీసు లు, తాను భిన్న ధ్రువాలుగా ఉన్నామని.. మారిన పరిస్థితుల్లో తాను ప్రజాసేవలోకి రావాల్సి వచ్చిందని తన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మెటర్నిటీ సౌకర్యాలు కల్పించాలి
మహిళా పోలీసులకు వీక్లీ ఆఫ్, ప్రత్యేక పనివేళల సౌకర్యాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. జూనియర్ మ హిళా కానిస్టేబుళ్లకు సీనియర్ అధికారులు మెంటార్లుగా ఉండి మార్గదర్శనం ఇవ్వాలన్నారు. మహిళా పోలీసుల కృషిని గుర్తిం చేలా ప్రత్యేక అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. వారికి రెస్ట్ రూములు, వెల్నె స్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో 80 వేల మంది పోలీసుల్లో మహిళా పోలీసులు కేవలం 7 వేల మంది మాత్రమే ఉన్నారని, వారి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
టీజీ ఫుడ్స్ మిషనరీపై సేఫ్టీ ఆడిట్
టీజీ ఫుడ్స్‌లోని మిషనరీపై సేఫ్టీ ఆడిట్ తప్పనిసరిగా జరిపించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గోదాముల్లో సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ సమావేశ మం దిరంలో తెలంగాణ ఫుడ్స్ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ. ఫహీం, శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ఎండీ చంద్ర శేఖర్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా రూపొందించిన బాలామృతం, బ్రేక్‌ఫాస్ట్ పౌడరును మంత్రి సీతక్క రుచి చూశారు. ఉత్పత్తుల్లో షుగర్ కంటెంట్ తగ్గించి, మిల్క్ కంటెంట్ పెంచాలని అధికారులను ఆదేశించారు. ఫోర్టిఫైడ్ రైస్, రెడీ టు కుక్ బ్రేక్‌ఫాస్ట్ పౌడర్, చిక్కీలు టీజీ ఫుడ్స్ ద్వారానే తయారు అ య్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. యూనియన్ల పేరుతో కొందరు విధులకు గైరాజరవుతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.