calender_icon.png 21 August, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌హెచ్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్ లంచవతారం

21-08-2025 12:00:00 AM

-రెస్టారెంట్ యజమాని వద్ద రూ.లక్ష డిమాండ్

-ఇవ్వకుంటే రెస్టారెంట్‌ను మూసేస్తానని బెదిరింపు

-రూ.౬౦ వేలకు కుదిరిన బేరం

-లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన గొల్ల దుర్గాప్రసాద్ 

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 20 (విజయక్రాంతి): హైదరాబాద్ నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ గొల్ల దుర్గాప్రసాద్ రెస్టారెంట్ యజమాని నుంచి రూ.60 వేల లంచం తీసుకుంటూ బుధవారం సీబీఐకి చిక్కాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌గేట్ హైవే పక్కన ఉన్న తాజా కిచెన్ రెస్టారెంట్ యజమానిని దుర్గాప్రసాద్ రూ.లక్ష లంచం అడిగాడు. ఇవ్వకుంటే రెస్టారెంట్‌ను తొలగించా లని లేదా కేసు బుక్ చేసి తొలగిస్తామని బెదిరించాడు.

రెస్టారెంట్ యజమాని రమేష్ బతిమిలాడగా మధ్యవర్తుల ద్వారా డైరెక్టర్‌కు రూ.60 వేల బేరం కుదిరింది. రెస్టారెంట్ నడవక తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న యజమాని ఈ విషయంపై ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు నేషనల్ హైవే అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అయినందున సీబీఐని సంప్రదిం చారు.

వారిచ్చిన సలహా మేరకు రెస్టారెంట్ యజమాని బుధవారం రూ.60 వేలు దుర్గాప్రసాద్‌కు ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా  పట్టుకుని, అరెస్టు చేశారు. హైదరాబాదులోని దుర్గాప్రసాద్ ఇంట్లో, సదాశివపేటలో ఆయన ఆస్తులపై సోదాలు జరుపుతున్నారు.