calender_icon.png 2 September, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకపై ఒకటే సాఫ్ట్‌వేర్

02-09-2025 12:00:00 AM

-త్వరలో 408 నక్షా గ్రామాల్లో రీసర్వే

-రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ప్రజలకు మరింత మెరుగైన పారద ర్శక సేవలు అందించడానికి రెవెన్యూ, స్టాం ప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను అనుసంధానం చేసేలా ఒకే సాఫ్ట్‌వేర్‌ను రూ పొందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం ఈ అం శంపై రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగం, ఎన్‌ఐసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూ భారతి పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా పోర్టల్ నిర్వహణ మరింత సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొత్తగా అభివృద్ధి చేసే సాఫ్ట్‌వేర్‌లో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టమ్ ఉండేలా చూడాలన్నారు. నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే కొలిక్కివచ్చిన నేపథ్యంలో మిగిలిన 408 గ్రామాల్లో  రీసర్వే చేస్తామన్నారు.